పవన్‌కు ఏదన్నా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత- జనసేన

 

పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్రలో ప్రజాయాత్ర సాగిస్తున్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు తగిన రక్షణ కల్పించడం లేదని జనసేన కార్యక్తలు మండిపడ్డారు. ఆయనకు ఏదన్నా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది జనసేన పార్టీ. పవన్ యాత్రను మొదలుపెట్టినప్పుడే ఆయనకు తగిన రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరామనీ, కానీ ప్రభుత్వమే ఆయన రక్షణకు అడ్డుపడుతోందనీ పార్టీ నాయకులు ఆరోపించారు. అంతకుముందు పలాసలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ మరోసారి ప్రత్యేక హోదాని అమలు చేయాలనీ, విశాఖ రైల్వేను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలనీ డిమాండ్ చేశారు. హోదా మీద తడవకో మాట మారుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుని దుయ్యబట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu