ఈ మూడు లక్షణాలు కనబడితే శరీరంలో రక్తప్రసరణ సరిగా లేదని అర్థం!
posted on Aug 9, 2023 11:08AM
శరీరం ఆరోగ్యంగా ఉండాలన్న, అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా అన్ని అవయవాలకు తగినంత రక్త ప్రసరణ అవసరం. రక్త ప్రసరణకు ఆటంకం కలిగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిని లైట్ గా తీసుకుంటే అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రక్త ప్రసరణలో సమస్యల కారణంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి కొన్ని అంతర్గత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడితే..
రక్త ప్రసరణ మొత్తం శరీరానికి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన అవయవాలకు ఆక్సిజన్ ను, అవసరమైన పోషకాలను నిర్వహిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ సరిగా లేకుంటే దాదాపు అన్ని అవయవాలపై దుష్ప్రభావాలుంటాయి. రక్త ప్రసరణ సమస్యపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.
రక్తప్రసరణ సమస్య ఉంటే ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే..
ఉష్టోగ్రతలో మార్పులు..
తరచుగా చేతులు, కాళ్ళు చల్లగా మారిపోతూ ఉంటే ఉంటే అది శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని లక్షణం. శరీరంలో రక్తం ఆరోగ్యకరమైన వేగంతో ప్రవహించలేనప్పుడు అది చర్మం, చేతులు, కాళ్ళ నరాల చివరలలో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఈ కారణంగా కాళ్లు, చేతుల వేళ్ళ చివర్లు చల్లగా ఉండటం జరుగుతూ ఉంటుంది.
మెదడు పనితీరుకు ఇబ్బంది..
పేలవమైన రక్తప్రసరణ మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది, ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత మందగించడం వంటి సమస్యలకు కారణమవుతుంది. మెదడుకు రక్తం సరిగా సరఫరా కాకపోతే ఆక్సిజన్ ప్రవాహం కూడా మందగిస్తుంది. దీని వల్ల చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ధూమపానం వంటి అలవాటు సాధారణ రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తాయి.
చర్మం రంగులో మార్పులు..
శరీరంలోని కణజాలాలలో రక్తం సరిగ్గా ప్రసరించనప్పుడు చర్మంపై స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో మొదట చర్మం సాధారణం కంటే పసుపు రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. కొందరిలో రక్తప్రసరణ సమస్య వల్ల చర్మంపై నీలి మచ్చలు కూడా ఏర్పడతాయి. ముక్కు, పెదవులు, చేతులు, కాళ్ళతో సహా ఇతర భాగాలలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ప్రాణానికి తీవ్రమైన ప్రమాదముందని అర్థం.
ఈ మూడు లక్షణాలు తరచుగా కనిపిస్తూ ఉంటే శరీరంలో రక్తప్రసరణ చాలా దారుణంగా ఉందని అర్థం. ఇది ప్రాణానికి ఎంతో ప్రమాదం.
*నిశ్శబ్ద.