ఎన్ డి ఏ సమావేశం ఢిల్లీలో...చంద్రబాబు సహా ఎన్డీఏ పక్షాల హాజరు

రేపు  అంటే ఈ నెల 25 (బుధవారం) ఎన్ డి ఏ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంటులో ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు ను ప్రవేశ పెట్టిన ఎన్ డి ఏకు మిత్ర పక్షాలు సపోర్ట్ చేశాయి. వీటిలో తెలుగు దేశం పార్టీ కూడా ఉంది. బిజెపి ఎంపీలు 20 మంది డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఎన్ డి ఏ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.  ప్రధాని మోదీతో సహా ఎన్ డిఏ భాగస్వామ్య పక్షాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.