‘సంఖ్య’ ఫై పార్టీలే తెల్చుకోవాలన్న షిండే

 

 

 

 

 

 

మరలా తెలంగాణా విషయం మొదటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంఫై ఈ నెల 28 న ఢిల్లీ లో అఖిల పక్ష సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి రాజకీయ పార్టీలు తమ తరపున వాదన వినిపించడానికి ఒక్కరిని పంపించాలా లేక ఇద్దరినా అనే విషయంలో ఇంకా స్పష్టంగా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

 

అయితే, ఈ విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నేడు ఓ ప్రకటన చేస్తూ, ఎంత మందిని పంపాలనే విషయంలో పార్టీలే ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంటే, బంతిని పార్టీల కోర్టులోకి నేట్టేసినట్లే. గతంలో హోం మంత్రిగా ఉన్న చిదంబరం ఇలా ఇద్దరేసి నేతలను పిలవడంతో ప్రతి పార్టీ భిన్న వైఖరులను వినిపించింది. దీనితో కేంద్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. అంటే, ఈ సమావేశం కూడా ఎలాంటి లాభం లేకుండా పూర్తవుతుందా అనే బలమైన సందేహాలు సగటు ప్రజానీకంలో కలుగుతున్నాయి.

 

ప్రత్యేక తెలంగాణా విషయంలో ఇదే చివరి సమావేశం అవుతుందా అనే ప్రశ్నకు, సమస్య పరిష్కారం అయ్యే వరకూ సంప్రదింపులు కొనసాగాలి కదా అని అన్నారు. ఇద్దరేసి నేతలని పంపితే, ఒక్కొక్కరూ ఒక్కో వాదనను వినిపిస్తారు. అంటే, ఈ సమావేశం కూడా వృధా ప్రయత్నమేనన్న మాట.

 

తెలుగు దేశం తరపున ఒక్కరే హాజరవుతారని ఆ పార్టీ నేత నామా నాగేశ్వర రావు చెప్పారు. ఇదే వైఖరి అన్ని పార్టీలు అనుసరిస్తే సమస్య ఉండదు. లేదంటే,ఈ అంశం మరలా మొదటికి వచ్చినట్లే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu