కోడి పందాలను ఆపలేం.... సుప్రీంకోర్టు

 

కోడిపందాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే ఈ కోడి పందాల విషయంపై ఎప్పటి నుండో కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. గతంలో కోడి పందాలపై హైకోర్టు నిషేదం విధించింది. అయినా కానీ కోడీ పందాలు మాత్రం యథావిథిగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నిషేధపు ఉత్తర్వులు ఇచ్చినా కానీ.. పందాలు నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులు సిద్ధ పడ్డారని జాతీయ జంతు సంరక్షణా విభాగం కోర్టులో వాదించింది. దీనికి ఇది తమ సంస్కృతిలో భాగమని, కోడి పుంజులు ఎదురు పడితే పోరాడుకోవడం వాటి జాతి నైజమని, పోటీల సందర్భంగా ఎలాంటి జంతు హింస ఉండదని, కోళ్లకు కత్తులను కట్టబోమని నిర్వాహకుల తరఫు న్యాయవాది వాదించారు. దీంతో కోడి పందాలను ఆపేలా ఉత్తర్వులు ఇవ్వలేమని.. విచారణను వాయిదా వేశారు.