ఇక జవహర్‌రెడ్డిని పంపించడం మిగిలింది

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది. ప్రతిపక్ష నాయకులను అధికార పార్టీ వేధించడానికి రాజేంద్రనాథ్ ‌రెడ్డి తనవంతు సహకారం అందిస్తున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ విషయంలో కూడా రాజేంద్రనాథ్ రెడ్డి తన ప్రభావాన్ని చూపే అవకాశం వుందని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎన్నికల కమిషన్ సాగనంపాల్సిన మరో అధికారి చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి. ఈయన రాజేంద్రనాథ్ రెడ్డి కంటే వందరెట్లు డేంజరస్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జవహర్ రెడ్డి కూడా జగన్ రెడ్డికి విధేయుడే. ఇప్పటికే ఆయన విధేయతను అనేక సందర్బాల్లో చూపిస్తూ వస్తున్నారు. పోలింగ్ సందర్భంగా కూడా జవహర్ రెడ్డి తన జగన్ భక్తిని ప్రదర్శించే ప్రమాదం వుంది. అందుకే జవహర్‌రెడ్డిని కూడా విధుల నుంచి తప్పించాల్సిన అవసరం వుంది. ఈ విషయంలో కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి.