సోనియాకు అస్వస్థత....ఆస్పత్రికి తరలింపు..


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. కొద్దికాలంగా తరచూ అస్వస్థతకు గురవుతున్న సోనియా మళ్లీ నిన్న అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను  ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోనియా ఉదర సంబంధమైన సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కాగా కొంతకాలంగా సోనియా సిమ్లాలోనే ఉంటున్నారు. త్వరలోనే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతుండటంతో.. అక్కడ ఉండి పార్టీ పనులని చక్కబెడుతున్నారు. అయితే సడెన్ గా ఆమె అస్వస్థకు గురవ్వడంతో ఢిల్లీ తరలించారు. మరోవైపు సోనియా అస్వస్థకు గురవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం ఏర్పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu