రేవంత్ ఎపిసోడ్.. క్లైమాక్స్ అదేనా..

 

గత కొద్ది రోజులుగా తెలంగాణ టీడీపీలో నడుస్తున్న రచ్చకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. విదేశీ పర్యటనలో ఇన్ని రోజులు బిజీగా ఉన్న చంద్రబాబు వచ్చిన వెంటనే హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ గౌస్ లో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం పై తుది నిర్ణయం తీసుకోవాలంటే... అమరావతి రమ్మని ఆదేశించారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం నేతలంతా... చలో అమరావతి అంటూ ఏపీ బాట పట్టేశారు. రేవంత్ ఈ మీటింగ్ కు వెళతారా.. ?వెళ్లకపోతే ఏమిటి? రేవంత్ తో పాటు పార్టీని వీడి ఎవరెవరు వెళతారు..? ఎవరెవరు మిగులుతారు? ఆ మిగిలినవాళ్లతో పార్టీని ఎలా నడపొచ్చు లాంటి అంశాల మీద.. ఈ భేటీలో స్పష్టత రావొచ్చు. మరోవైపు బుజ్జగింపుల స్థాయి దాటిపోయింది కనుక.. రేవంత్ పై బహిష్కరణ వేటు వేయాలన్న ప్రతిపాదన  ఓకే అయ్యేది కూడా ఇక్కడే.

 

ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి ఓ వైపు ఒక వైపు ఉండగా తెలంగాణ టీడీపీ నేతలంతా మరోవైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను బాగా హర్ట్ అయిన నేతలు రేవంత్ రెడ్డిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డిని పార్టీ నుండే సస్పెండ్ చేయాలని నేతలు చంద్రబాబు దగ్గర ప్రతిపాదిస్తున్నారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణ టీడీపీ  తన పట్ల పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా, పార్టీ అధినేత చంద్రబాబు తనను అర్థం చేసుకోగలరన్న నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకం నిజమయ్యేలాగానే కనిపిస్తోంది. దూకుడు అవసరమేనని, అయితే సందర్భానుసారం ఆ దూకుడు ప్రదర్శించాలి తప్ప చీటికీమాటికీ దూకుడు ప్రదర్శిస్తే అది మంచి ఫలితాలివ్వబోదని రేవంత్‌రెడ్డికి చంద్రబాబు తెలియజేసినట్లు సమాచారమ్‌. మొత్తానికి టీటీడీపీ నేతలు రేవంత్ రెడ్డిపై కత్తి కట్టినా... చంద్రబాబు మాత్రం రేవంత్ ను మందలించి వదిలేస్తారేమో అనిపిస్తోంది. మరి ఈ రోజు సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu