కేటీఆర్ కు రేవంత్ సవాల్..
posted on Oct 27, 2017 5:52PM
.jpg)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే రేవంత్ రెడ్డి అధికార పార్టీపై మాటల దాడి మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎప్పుడూ కేసీఆర్ ను టార్గెట్ చేసే రేవంత్ రెడ్డి... ఈసారి రూట్ మార్చి కేటీఆర్ ను టార్గెట్ చేశాడు. అంతేకాదు.. అప్పుడే కేటీఆర్ కు రేవంత్ రెడ్డి ఓ సవాల్ కూడా విసిరాడు. ఇటీవల డ్రగ్స్ మాఫియాపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలువురు ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే దీనిపై రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ ప్రశ్నించాడు. కానీ దీనిపై చర్చ జరగకపోవడంతో...సభలో తన ప్రశ్న రాకుండానే అసెంబ్లీ వాయిదా వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారాయన. అంతేకాదు కేటీఆర్ కు ఓ సవాల్ కూడా విసిరాడు. నేను బార్ల వెంట తిరుగుతున్నానని చెబుతున్నారు. నేను నా రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలను పోలీసులకు ఇచ్చేందుకు సిద్దం. మరి కేటీఆర్ అలా పోలీసు అధికారులకు నమూనాలు ఇస్తారా అని బహిరంగ సవాల్ విసిరారు. కేటీఆర్ బావమరిది పాకాల రాజుతో కుమ్మక్కై… అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు లేకపోతే బొక్కలో వేస్తానని సి.ఎం కేసీఆర్ అంటున్నారు. దమ్ముంటే నన్ను జైలుకు పంపండి. నేను ఆరోపణలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.