నేడు విజయవాడలో స్మృతి ఇరానీ పర్యటన..

 

కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విజ‌య‌వాడలో పర్యటిస్తున్నారు. నగరంలోని పాతబ‌స్తీలో నిర్వహిస్తోన్న గుజ‌రాతీ స‌మాజ్ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొంటున్నారు. గుజ‌రాతీ స్కూల్‌లో నూత‌న ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  దేశానికి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రానికి చంద్రబాబు దిశానిర్దేశకులని అన్నారు. విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకునేందుకు కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా బాలికల విద్య పట్ల ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.

 

అనంతరం ఆమె విద్యార్ధులతో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నట్లు తెలుస్తోంది. కాగా ఆమెతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేత‌లు కామినేని, ఎంపీ కంభంపాటి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈరోజు మ‌ధ్యాహ్నం సీఎం చంద్ర‌బాబుతో ఆమె భేటీ అవుతారు.