రికార్డ్ సృష్టించిన హిల్లరీ క్లింటన్..

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ రికార్డ్ సృష్టించారు. ప్యూర్టో రికోలో జరిగిన ప్రైమరీలో హిల్లరీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. దీంతో శాండర్స్ ను అధిగమించి అధ్యక్ష నామినేషన్ కోసం కావాల్సిన 2383 డెలిగేట్లను హిల్లరీ గెలుచుకున్నారు. శాండర్స్ కు 1,5691 డెలిగేట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ ఖరారైంది. అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ రేసులో ఓ మహిళ నిలవడం ఇదే ప్రథమం. ఇక తన గెలుపుపై హిల్లరీ కూడా ట్విట్టర్లో 'గాట్ ప్రైమరీస్ టూ విన్' అంటూ  షేర్ చేసుకున్నారు.

 

అయితే శాండర్స్ మాత్రం.. జూలై నెల వరకు ఎవరు డెమొక్రటిక్ అభ్యర్థిగా వెళతారు ఎదురు చూడాల్సిందే తప్ప.. ఇప్పుడే ఆఖరు అనుకోవద్దని వ్యాఖ్యనించడం గమనార్హం. మరి చూద్దాం.. ఎవరు డెమోక్రటిక్ అభ్యర్థిగా వెళతారో..