ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చించాలి: హరీష్ రావ్

ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై  తెలంగాణ అసెంబ్లీలో రగడ జరిగింది. ఈ అంశంపై చర్చించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్  డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసిన నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై చర్చించాలని ఆయన పట్టు బట్టారు. ఒక ప్రజాప్రతినిధిని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కేసు నమోదు చేయడాన్ని హరీష్ రావ్ తప్పు పట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కల్సి అసెంబ్లీలో చర్చపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది అక్రమ కేసు అని హరీష్ రావ్ వాదించారు.  తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే ఈ ఈవెంట్  కండక్ట్ చేసినట్టు హరీష్ రావ్ చెప్పుకొచ్చారు.