కెటీఆర్ అరెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలానికి కారణమవుతుందా..?

మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలానికి కారణమవుతుందా..?

అసలు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు జరగాలి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఆధారాలతో
సిద్ధంగా ఉందా..!?

కేటీఆర్ అరెస్ట్ అనంతరం ఎదురు కాబోయే పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందా...
 
అసలు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు జరగాలి..ఆయన ఏం తప్పు చేశారు..ఈ విషయంలో
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది.. 

ఆ వివరాలు తెలుసుకుందాం..

ఫార్ములా 1 కార్ రేస్ ఉదంతంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అక్రమాలు జరిగాయని..
అప్పటికి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ వ్యవహారంలో నిధుల గోల్మాల్ కు పాల్పడ్డారని ప్రధానంగా ఆరోపిస్తూ ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం..కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి తెలంగాణ గవర్నర్ ఇప్పటికే అనుమతి ఇచ్చినట్టు కూడా వార్తలు ఉన్నాయి.
 ప్రతి ఉదంతంలో జరిగినట్టే 
ఈ వ్యవహారంలో కూడా ప్రధాన నిందితుడుగా పేర్కొనే కేటీఆర్ తాను ఏ తప్పు చేయలేదని..ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను గురించి ప్రశ్నిస్తున్నందుకే తమపై ఇలా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని 
ఆరోపిస్తున్నారు. 
ఈ విషయంలో న్యాయపోరాటానికి తాము సిద్దంగా ఉన్నామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తన వంతుగా ఆయన ఈసరికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు నిజానికి ఫార్ములా 1 రేసు ఉదంతంలో తాను మంత్రిగా విధాన నిర్ణయం తీసుకున్నానని.. ఈ విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన నిర్డవంధ్వంగా చెబుతున్నారు.
ఇప్పటి వరకు తనను అరెస్ట్ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించిన రేవంత్ ప్రభుత్వం అది సాధ్యపడకపోవడంతో ఇప్పుడు మరో కొత్త తప్పుడు ఆరోపణతో తన అరెస్టుకు రంగం సిద్ధం చేసుకుంటోందని ఆయన దుయ్యబడుతున్నారు.
ఏదోలా తనను జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు 

ఇదిలా ఉండగా కేటీఆర్ ను అరెస్టు చేయడం అంటూ జరిగితే అల్లర్లు సృష్టించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ అభిమానులు..బిఆర్ఎస్ కార్యకర్తలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ప్రభుత్వం కూడా అరెస్టు విషయంలో వెనకంజ వేయకుండా ముందుకు వెళ్లాలని..
ఒకవేళ అరెస్టు అనంతరం ఎటువంటి పరిణామాలు ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధపడే ఉన్నట్టుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కాగా తెలంగాణ ఏసీబీకి ఈడి అధికారులు ఇప్పటికే ఒక లేఖ రాసినట్టు సమాచారం ఉంది. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఎఫ్ఐఆర్ కాపీలతో సహా తమకు అందజేయాలని..
ఈ విషయంలో డబ్బు ఎంత మేరకు చేతులు మారిందో 
ఆ వివరాలు కూడా తమకు చెప్పాలని ఈడి ఏసీబీని కోరింది..కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఇప్పటికే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని.. ఏ క్షణానైనా అరెస్టు జరగొచ్చని తెలుస్తోంది. 

కేటీఆర్ అరెస్టు విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడే అడుగు ముందుకు వేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.మొన్నటికి మొన్న సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత అభాసు పాలయింది..అల్లుఅర్జున్ అరెస్టు నిజంగా అవసరమా కాదా..సంధ్య థియేటర్ ఉదంతంలో అల్లు అర్జున్ కు ఎంతవరకు బాధ్యత ఉంది..
ఈ విషయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినా అది ఏ మేరకు నిలబడుతుంది..
ఇత్యాది అంశాలను కూలంకషంగా పరిశీలించకుండా... 
చట్టపరమైన కొన్ని అంశాలను నిశితంగా పరిగణనలోకి తీసుకోకుండా అదేదో 
కాకతాళీయ వ్యవహారం అన్నట్టు బన్నీ అరెస్టు విషయంలో దుందుడుగ్గా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరా ఒక రోజులోనే పుష్పరాజ్ కు బెయిల్ రావడంతో ఒక రకంగా చెప్పాలంటే నవ్వులు పాలైంది. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ అరెస్టు విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.. ఇప్పటికే ప్రాథమిక వ్యవహారాలన్నీ పూర్తయ్యాయి గనుక పక్కా ఆధారాలతో కేటీఆర్ అరెస్టు విషయంలో ముందడుగు వేయాలని రేవంత్ ప్రభుత్వం నిశ్చయించింది. 

ఇదిలా ఉండగా కేటీఆర్ అరెస్ట్ అనగానే బిఆర్ఎస్ పార్టీలో కొందరు పనిగట్టుకొని ఒక రకమైన ప్రకారాన్ని ఇప్పటికే జనాల్లోకి వదులుతున్నారు. రాజకీయ ప్రముఖులు ఎవరు అరెస్టు అయినా వారు వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అవుతున్నారని..ఈ లెక్కన ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం తద్యమనే టాక్ తెలంగాణలో ఇప్పుడు బలంగా నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్ అరెస్టు అయి జైల్లో ఉండి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని..తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా జగన్ ప్రభుత్వంలో అరెస్టై విడుదలైన కొన్నాళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు కనుక ఇప్పుడు అదే సెంటిమెంట్ వచ్చే ఎన్నికల నాటికి పనిచేసి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అని ఆయన అభిమానులు అంటున్నారు. ఇదంతా ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న సామెత చందాన లేదూ..

అన్నట్టు మరో విషయం..
ఇంతకు ముందు కవితని అరెస్టు చేసినప్పుడు
తెలంగాణ ప్రజలు
ఎటువంటి యాగీ చెయ్యలేదు.
చాలా కూల్ గా తీసుకున్నారు.
కవితలు బెయిల్ వచ్చిందా లేదా అనే విషయం
పట్ల కనీస ఆసక్తి కూడా కనబరచలేదు..తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు ఉండి పోయారు.
మరి ఇప్పుడు కేటీఆర్ అరెస్టు అయితే మాత్రం తెలంగాణ ప్రజలు వేరుగా రియాక్ట్ అవుతారని..అల్లర్లు.. నిరసనలు..ఆందోళనలకు తెగబడతారని ఎలా అనుకోవడం.

మరి అల్లర్ల విషయంలో వినిపిస్తున్న హెచ్చరికలు
ముందస్తు ప్రణాళికతో బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్నవేనా..
ప్రజలు అప్పుడొకలా ఇప్పుడొకలా రియాక్ట్ అవడం అంటూ జరిగితే మాత్రం రేవంత్ సర్కార్ పాలనపై కొంత విముఖత మొదలైందని భావించవచ్చా..అదే జరిగితే
ఇదంతా దేనికి సంకేతం అనుకోవచ్చు..చూద్దాం..