వాణీకి సుశీల పురస్కారం

 

ప్రతి సంవత్సరం పి.సుశీల ట్రస్ట్ అధ్వర్యంలో అందజేసే పి.సుశీల పురస్కారాన్ని ఈ సంవత్సరం ప్రముఖ గాయనీ వాణీ జయరామ్ కీ లభించింది.ప్రముఖ గాయనీ రావు బాలసరస్వతీదేవి అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంది. ఈ పురస్కారంలో భాగంగా గ్రహితకు జ్ఞాపికతో పాటు, లక్ష రూపాయల నగదును కూడా ప్రధానం చేయనున్నారు. ఈ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఈ నెల 9వ తేదిన హైదరాబాద్ లొని రవీంద్రభారతిలో జరుగుతుందని కార్యక్రమ కన్వీనర్ సంజయ్ కిషోర్ తెలిపారు.