జనవరి 16 న వెంకీ,చెర్రీల అనుబంధం

 

వెంకటేష్, రాంచరణ్ కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ జనవరి 16 నుండి ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుపుకోనుంది. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చరణ్ కు బాబాయ్ గా వెంకటేష్ నటించనున్నాడు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో బండ్ల గణేష్ నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.