శేఖరుడి పెళ్లి విందు....!

 

"నువ్విలా", "నచ్చావులే" వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర వివాహం మాధురీతో నవంబర్ 28న విజయవాడలో జరిగింది. ఈ వివాహ విందు కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు విచ్చేసారు. రామోజీరావు, కె.ఎల్.నారాయణ,కె.ఎల్ దామోదరప్రసాద్, స్రవంతి రవికిషోర్,ఎస్ గోపాల్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, వంశీ, బి.గోపాల్, రవిబాబు, తమ్మారెడ్డి భరద్వాజ లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులు శేఖర్ చంద్ర, మాధురీలకు శుభాకాంక్షలు తెలిపారు.