రెండోసారి నరకం చూపిస్తాడా...?

 

దర్శకుడు సెల్వరాఘవన్ మీద ఉన్న నమ్మకంతో భారీ బడ్జెట్ తో "వర్ణ" చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ప్రసాద్.వి.పోట్లురి మరో సాహసం చేస్తున్నాడు. అసలే "వర్ణ" సినిమాకు కలెక్షన్లు లేక అట్టర్ ఫ్లాప్ అవడంతో ప్రసాద్ పూర్తిగా నష్టాలపాలయ్యారు. ఆర్య, అనుష్క జంటగా నటించిన ఈ సినిమాకు కనీస కలెక్షన్లు కూడా రాలేకపోయాయి. అయితే ఈ నిర్మాత మాత్రం ఇలాంటివి ఏం పట్టించుకోకుండా దర్శకుడు సెల్వరాఘవన్ తో కలిసి మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ధనుష్ హీరోగా నటించనున్నాడు. కానీ ఈ సినిమాకు సెల్వ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవట్లేదని తెలిసింది. మరి ఈసారైన సెల్వ హిట్టు చిత్రాన్ని అందిస్తాడో లేక "వర్ణ" చిత్రం చూసి భయపడినట్లుగా..తనను చూసి జనాలు, నిర్మాతలు భయపడే విధంగా చేసుకుంటాడో త్వరలోనే తెలియనుంది. పి.వి.పి. సంస్థ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.