డిసెంబర్ 5న మగాడు ఎంట్రీ...!

 

"ప్రేమకథాచిత్రం" తర్వాత సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం "ఆడుమగాడ్రాబుజ్జి". కృష్ణారెడ్డి గంగాదాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అస్మితసూద్, పూనమ్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ఎం.సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శ్రీ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది.