క్రేజీ శంకర్ తో చిరు 150..!

 

 

 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ సారి క్రేజీ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త రావడం మళ్ళీ మాయమవడం ఇలా జరుగుతూ వస్తుంది. అయితే ఈ సారి మాత్రం మెగాస్టార్ 150వ సినిమా మెయిన్ ట్రాక్ ఎక్కబోతున్నట్లు మెగా అభిమానులు పక్కగా చెబుతున్నారు. అయితే గత కొంతకాలంగా 150వ సినిమాపై సైలెంట్ గా వున్న చిరంజీవి...ఇంత సడన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సినీ విశ్లేషకులకు అర్ధంకావడం లేదు. మరి ఈ వార్త కూడా నిజమా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే.