రకుల్ సోదరుడి డ్రగ్స్ వ్యవహారం: పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు
posted on Dec 27, 2025 1:55PM

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు కొరడా ఝళిపిస్తూ ఉండడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసుల విచారణలో తేలింది. నెల రోజుల వ్యవధిలోనే అతడు అరడజను సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడిం చారు. ట్రూప్ బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి నుంచి నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతడు డ్రగ్స్ కొనుగోలు చేసిన ప్రతిసారీ ఆన్‌లైన్ ద్వారానే నగదు బదిలీ చేశాడన్న ఆధారాలు లభ్యమయ్యాయి. అతడి బ్యాంక్ లావాదేవీల వివరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సింఘానియా సోదరుల మొబైల్ ఫోన్లలోని వాట్స్అప్ చాట్లను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా, అందులో అమర్ సింగ్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ డిమాండ్, డెలివరీ సమయం, చెల్లిం పుల వివరాలకు సంబం ధించిన సందేశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు వాట్స్అప్ చాట్లు ప్రధాన ఆధారాలుగా మారాయి. డ్రగ్స్ కొనుగోళ్ల లో అమర్ సింగ్ ఒంటరిగా కాకుండా యష్, ధరమ్ తేజ్ అనే వ్యక్తులతో కలిసి పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరంతా కలిసి డ్రగ్స్ వినియోగించినట్టు, అవసరమైనప్పుడు ఒకరికొకరు సమకూర్చుకున్నట్టు సమా చారం. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విలు అమర్ సింగ్‌కు డ్రగ్స్ డెలివరీ చేస్తున్న సమయంలోనే నిఘా పెట్టి పట్టుకున్నట్టు వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనతో కేసు మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ సర ఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.అసలు సింఘానియా సోదరుల నుంచి అమర్ సింగ్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎందుకు కొనుగోలు చేస్తున్నాడనే అంశంపై పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీస్తు న్నారు. డ్రగ్స్‌ను స్వయంగా వినియోగించడానికేనా? లేక ఇతరులకు సరఫరా చేస్తున్నాడా? అన్న కోణాల్లో విచారణ సాగుతోంది. అమర్ సింగ్ కు డ్రగ్స్ పార్టీలను నిర్వహించే అలవాటు ఉందని ప్రాథమికంగా తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ పార్టీలకు హాజరైన వారిపై కూడా విచారణ చేపట్టే అవకాశముందంటున్నారు.ఈ కేసు ద్వారా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.