కరీనా సైఫ్ జంటకి పెటా వెజ్ చాక్లెట్
posted on Oct 17, 2012 1:38PM

బాలీవుడ్ కొత్త జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లకు ముంబైలోని జంతుహక్కుల పరిరక్షణ సంస్థ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ ఏనిమల్స్ ప్రత్యేకంగా ఓ కానుకను సిద్ధం చేసింది. శాఖాహార పదార్ధాలతో మాత్రమే తయారుచేసే వెగన్ ఛాక్లెట్ చికెన్స్ ని కొత్త దంపతులకు పెటా సంస్థ.. కానుకగా పంపిస్తోంది. కరీనా పూర్తిగా శాఖాహారి కనుక ఈ కానుకనివ్వడం చాలా బాగుంటుందని పెటా సభ్యులు భావిస్తున్నారు. బాంద్రా ఏరియాలో ఉన్న సైఫ్ ఇంట్లోనే కరీనా, సయీఫ్ ల వివహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. ముందుగానే దరఖాస్తు చేసుకోవడంవల్ల రిజిస్ట్రార్ కూడా ఇంటికే వచ్చి పెళ్లిని నమోదుచేసుకున్నారు. లాంఛనాలు పూర్తి కాగానే నూతన దంపతులు ఇంటి బాల్కనీలోకొచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఈ రిజిస్టర్డ్ మ్యారేజీకి కరీనా తల్లిదండ్రులు బబిత, రణ్‌ధీర్ కపూర్, సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ సాక్షులుగా సంతకం చేశారు. షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, తుషార్ కపూర్, అమృతా అరోరా లాంటి నటీనటులు వివాహ వేడుకకు హాజరై కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.