“ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా“కి టెండూల్కర్ అర్హుడేనా?
posted on Oct 17, 2012 1:42PM

ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యత్వాన్ని సచిన్ టెండూల్కర్ కివ్వడం సమంజసం కాదంటూ అక్కడి క్రికెట్ అభిమానులు, అభిమాన సంఘాలు మండిపడుతున్నాయ్. ఈ విషయంమీద ఆందోళన జరిపేందుకుకూడా అక్కడివాళ్లు సిద్ధమౌతున్నారు. గతంలో సిడ్నీ టెస్ట్ సందర్భంగా తలెత్తిన జాతి వివక్ష వ్యాఖ్యల వివాదంలో ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కి వ్యతిరేకంగా మాట్లాడ్డమేకాక, తోటి క్రీడాకారుడు హర్భజన్ సింగ్ ని వెనకేసుకొచ్చిన సచిన్ కి అంతటి ఉన్నత పురస్కారమివ్వడం అస్ట్రేలియాలో చాలామంది క్రికెట్ అభిమానులకు రుచించడంలేదు. ఆసీస్ ప్రథాని గిలార్డ్ నుంచి ప్రకటన వెలువడిన మరు క్షణమే ఆస్ట్రేలియా పత్రిక హెరాల్డ్ సన్ తన వెబ్ సైట్ లో ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. సచిన్ కి మద్దతుగా దాదాపు 45 శాతం ఓట్లు పోలైతే, వ్యతిరేకంగా 56 శాతం ఓట్లు పోలయ్యాయి.