భారత్ లో అత్యంత ధనికుడు ఆఖరి నిజాం
posted on Oct 17, 2012 11:18AM
.jpg)
ప్రపంచం మొత్తంమీద అత్యంత సంపన్నుడు ఎవరని అడిగితే ఠక్కున ఏ బిల్ గేట్సో అని చెప్పేయడం మామూలైపోయింది. కానీ.. ఇలాంటి అంచనాలు తప్పని రుజువుచేసే పక్కా వివరాల్ని సెలబ్రిటీ నెట్ వర్త్ అనే వెబ్ సైట్ సేకరించింది. లండన్ పత్రిక ద ఇండిపెండెంట్ ఈ వివరాల్ని ప్రచురించింది. జాబితాలో మొత్తం 24మంది ఉన్నారు. వాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే బతికున్నారు. భారత్ లో ఇప్పటివరకూ అత్యంత ధనికుడైన వ్యక్తి ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని లెక్కలు పక్కాగా చెబుతున్నాయ్. అంతేకాదు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన ఆరో స్థానంలో ఉన్నారు. 1967లో 80 సంవత్సరాల వయసులో చనిపోయిన ఉస్మాన్ అలీ ఖాన్ భారతీయులందరిలోకీ ఆల్ టైం సంపన్నుడని సెలబ్రిటీ నెట్ వర్త్ చెబుతోంది. ఆయన ఆస్తుల విలువ 11.80,000 కోట్ల రూపాయలు. 14వ శతాబ్దంలో మాలిని పరిపాలించిన మన్సా మూసా అనే రాజు ప్రపంచంలోకెల్లా ఆల్ టైం సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 20,00,000 కోట్ల రూపాయలు. ఉప్పు , బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలవడంవల్లే ఇంత సంపదను పొందగలిగాడట. నెట్ వర్త్ వెబ్ సైట్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో 14మంది అమెరికన్లే ఉన్నారు. జాన్ డి రాక్ ఫెల్లర్ అమెరికాలో ఆల్ టైం సంపన్నుడిగా అవతరిస్తే, వారెన్ బఫెట్ కి మాత్రం ఈ జాబితాలో అతి బీదవాడి స్థానం దక్కింది. అదికూడా ఆయన దాన ధర్మాలు చేయడానికి ముందున్న లెక్కల్ని తీసుకుంటేనే..
1)