ఒంటరినైపోయాను...

 

రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఇప్పుడు ఓ పాట గుర్తొస్తుంది. ఒంటరినైపోయాను.. ఇక ఇంటికి ఏమని పోనూ అన్న పాట. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పటినుండి వివాదం మొదలైంది. అంతేకాదు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డిని.. రేవంత్ కాంగ్రెస్ పార్టీ మారే ఉద్దేశంతో రాహుల్ గాంధీతో మాట్లాడటానికే వెళ్లారని వార్తలు బయటకువచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కేసు వేయడానికే వచ్చానని... అయినా కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా ఏపీ టీడీపీ నేతలపై కూడా కామెంట్లు చేశారు. ఏపీ మంత్రులకు తెలంగాణలో పనేంటి అని.... పరిటాల శ్రీరామ్ పెళ్లికి వచ్చిన కేసీఆర్ తో అంత సేపు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తెలంగాణ పొలిటి బ్యూరో సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై.. రాహుల్ గాంధీతో భేటీ గురించి క్లారిటీ ఇవ్వాలని అడుగగా.. దానికి గాను తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. చంద్రబాబుతోనే మాట్లాడతానని దురుసుగా వ్యవహరిచంచారు. దీంతో ఇక రేవంత్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అనుకున్నారు. కానీ చంద్రబాబు వల్ల రేవంత్ మనసు మార్చుకున్నట్టు రాజకీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం. కానీ రేవంత్ మనసు మార్చుకున్నా..టీడీపీ నేతలు మాత్రం ఆయనపై గుర్రుగానే ఉన్నారు. రేవంత్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.

 

ఇక ఇంతా చేసి తాను కదిలితే త‌న‌తోపాటు మ‌రో 20 మంది నాయ‌కులు వస్తారని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఒంటరైపోయినట్టు తెలుస్తోంది. పార్టీ నాయ‌కుల‌తో సంబంధం లేకుండా శాస‌నస‌భా ప‌క్షం మీటింగ్ పెట్టాల‌నుకున్న రేవంత్‌కి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ స‌మావేశానికి ఎవ్వరూ వ‌చ్చే ప‌రిస్ధితి లేక‌పోవ‌డంతో చివ‌రికి దాన్ని ర‌ద్దు చేసుకోవాల్సివ‌చ్చింది. బాబుతో విడిగా భేటీ అయి త‌న కెపాసిటీ చూపించుకోవాల‌నుకుంటే అదికూడా సాధ్యం కాలేదు. చంద్రబాబు నో చెప్పారు. దీంతో  కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ద‌గ్గర బీరాలు పోయిన రేవంత్‌రెడ్డి చివ‌ర‌కి ఏకాకిగా మారాడని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మరి చూద్దాం ఆఖరికి రేవంత్ పరిస్థితి ఏమవుతుందో..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu