రాహుల్ తన పెళ్లి గురించి ఏమన్నాడో తెలుసా..!


రాజకీయ నేతల్లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ఎవరంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని టక్కున చెప్పేస్తారు. పాపం ఎందుకో రాహుల్ కు వయసు పోతుంది కానీ... పెళ్లి మాత్రం అవ్వడం లేదు. ఇక రాహుల్ గాంధీ పెళ్లి విషయంలో ఆయనపై పలు సెటైర్లు కూడా విసిరారు. అంతేకాదు గతంలో రాహుల్ పెళ్లిపై వార్తలు కూడా వచ్చాయి. సోనియా గాంధీ రాహుల్ కు ఓ బ్రహ్మాణ యువతిని చూసిందని...దానికి రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా తన పెళ్లిపై మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో బిజినెస్ అవార్డుల ఫంక్షన్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నాడు. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బాక్సర్ విజేందర్ మీ మ్యారేజ్ ఎప్పుడని రాహుల్‌ని ప్రశ్నించారు. దీనికిగాను రాహుల్  అంతా విధిరాత, తాను విధిని నమ్ముతానని, ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుందన్నారు. మొత్తానికి తన పెళ్లిపై రాహుల్ కే నమ్మకం లేనట్టు కనిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu