రేవంత్ కు చంద్రబాబు నో... బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా..?
posted on Oct 27, 2017 3:12PM
.jpg)
రేవంత్ రెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా...? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకు చేశాడో.. ఎవరన్న తనతో అలా చేయించారో.. లేదో..? తానే ఆవేశంలో చేశాడో తెలియదు కానీ.. సొంత పార్టీ నేతలపైనే అనవసరపు కామెంట్లు చేసి నానా రచ్చ చేసుకున్నాడు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చినా కానీ గట్టిగా ఖండిచలేదు. ఆ తరువాత చంద్రబాబు చేసిన ఫోన్ కాల్ తో రేవంత్ తాను పార్టీ మారే విషయంలో యూటర్న్ తీసుకున్నాడన్న వార్తలు వచ్చాయి. వెరసి ఇప్పుడు టీడీపీ నేతలే రేవంత్ రెడ్డి చేసిన యాగికి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ను పార్టీ నుండే ఏకంగా సస్పెండ్ చేయమని అధినేత చంద్రబాబును కోరుతున్నారు.
ఇక ఇన్ని రోజులు విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రానే వచ్చారు. తాను తిరిగి వచ్చేంత వరకూ టీఎస్ టీడీపీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ కు ఉన్న అధికారాలన్నిటినీ తొలగిస్తున్నానని..నేను వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఆయన.. వచ్చిన వెంటనే టీటీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే పార్టీ మారబోతున్నారన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి ఏకంతంగా భేటీ కావాలనుకున్నాడట. కానీ చంద్రబాబు దానికి నో చెప్పారట. ఐతే, తెలంగాణా తెలుగుదేశం నాయకులతో లేక్‌వ్యూ సమావేశం ఏర్పాటు చేశానని, కలవాలనుకుంటే అక్కడే అందరితోపాటు కలవాలని రేవంత్‌కు కబురు పంపారట. దీంతో ఏం చేయాలో అర్థంకాని రేవంత్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిపోయారట. మొత్తానికి రేవంత్ రెడ్డి విషయంలో చంద్రబాబు బాగానే సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... చూడాలి.