ఆమెకు అత్యాశ... అతనికి ఆవేశం...
posted on Oct 27, 2017 1:12PM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి.. శశికళకు పెద్దగా తేడా లేదనిపిస్తోంది. ఇద్దరిలోనూ ఒకటే పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరికీ సీఎం పదివిని ఆధిరోహించాలన్న అత్యాశ. ఆఖరికి ఎమైంది. ఇద్దరికీ అక్రమాస్తుల కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ సీఎం పదవి పై ఎంత వ్యామోహం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చే ఎన్నిక్లలో తానే సీఎం అని.. తానే అధికారం చేపడతానని తనకు తానే చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. తన తండ్రి మరణానంతరం ఏకంగా సీఎం పదవికే టెండర్ వేసిన జగన్.. సోనియా గాంధీ దానికి ఓప్పుకోకపోవడంతో ఏకంగా పార్టీ నుండే బయటకు వచ్చేశాడు. తన తండ్రి పేరు మీద కొత్త పార్టీ పెట్టి.. కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోశాడు. ఇక ఆతరువాత ఎలాగో అలా ప్రతిపక్ష నేతగా ఎదిగాడు. తక్కువ కాలంలోనే ప్రతిపక్ష నేతగా ఎదిగిన జగన్... అలానే ప్రజల పక్షాన నిలిచి వారి తరుపున ప్రభుత్వంపై పోరాటం చేస్తే కాలం కలిసివచ్చి వచ్చే ఎన్నికల్లో పదవి దక్కేదేమో. అలా కాకుండా.. ఎప్పుడు చూసినా అధికార పార్టీపై విమర్శలు చేయడం.. అదీ కాకుండా సీఎం అని కూడా చూడకుండా.. ఉరి తీయాలని.. కాల్చిపారేయాలని.. బంగాళఖాతంలో కలిపేయాలని నోటికి వచ్చినట్టు మాట్లాడేశాడు. ఫలితం నంద్యాల ఎన్నికల్లో ఘోర పరాజయం. ఆ తరువాత కాకినాడ ఎన్నికలు..ఆ తరువాత పార్టీనుండి కీలక నేతలు జంపింగ్ లు...తరువాత పాదయాత్రకు ఆటంకాలు ఇలా ఒకదాని తరువాత ఒకటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇక ప్రజలకు కూడా జగన్ పై అంత నమ్మకం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక శశికళ అయితే జయలలిత ఎప్పుడు మరణించారో.. ఆతరువాత సీఎం పదవిని దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డారు. ముందు అమ్మ చనిపోయిన వెంటనే ఆ పదవిలో శశికళనే కూర్చోబెట్టాలని అందరూ అనుకున్నారు. పోనీ పార్టీ పదవి అయిన జయలలిత నమ్మినబంటు పన్నీరుసెల్వంకు ఇచ్చిందా అంటే అదీ లేదు. ఆమె మేనల్లుడు దినకరన్ కు కట్టబెట్టింది. అంతే.. ఇక కొద్దిగంటల్లో శశికళ ముఖ్యమంత్రి పదవిపై ప్రమాణ స్వీకారం చేస్తుంది అనుకునేలోపు పన్నీర్ సెల్వం షాకిచ్చాడు. శశికళకు వ్యతిరేకంగా పోరాటానికి దిగాడు. దీంతో శశికళ అసలు రూపం బయటపడింది. అంత వరకూ చాలా సైలెంట్ గా ఉన్న ఆమె.. పదవి కోసం ఏకంగా ఎమ్మెల్యేలను రహస్య ప్రదేశాలకు తరలించడం.. అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గడం జరిగిపోయింది. అప్పుడే మరో ట్విస్ట్ ఎదురైంది. అక్రమాస్తుల కేసులో భాగంగా జైలు శిక్ష పడి.. జైల్లో పడాల్సి వచ్చి పడింది. మర్యాదగా సీఎం పదవి తాను తీసుకొని... పార్టీ పదవి పనీర్ సెల్వంకు ఇచ్చి ఉంటే ఎలాంటి గొడవా ఉండదు. అత్యాశకు పోయి ఆఖరికి జైల్లో పడాల్సి వచ్చింది. మొత్తానికి అదెదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు వీరిద్దరినీ చూస్తుంటే అతిగా ఆశపడే ఆడది.. అతిగా ఆవేశపడే మగాడు చరిత్రలో బాగుపడినట్టు చరిత్రలో లేదన్నడైలాగ్ గుర్తొస్తుంది. ఇద్దరూ ఆత్యాశకు పోయి ఆఖరికి ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారు.