భార్యాభర్తల బంధంలో నమ్మకం పెరగాలంటే ఇలా చేయండి..!
posted on Jan 23, 2025 9:30AM
.webp)
నమ్మకం ఏ బంధం లో అయినా మూలకారణం అవుతుంది. నమ్మకం లేకపోతే చిన్నచిన్న విషయాలే పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. ఇక జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య ఈ నమ్మకం ఎక్కువే ఉండాలి. చాలా వరకు భార్యాభర్తల రిలేషన్ అనేది నమ్మకం లోపించడం వల్లే విఫలం అవుతుంటాయి. నమ్మకం లేని చోట కనీసం మనుషుల మీద మంచి అభిప్రాయం కూడా ఉండదు. భార్యాభర్తల మధ్య నమ్మకం పెరగడానికి ఏం చేయాలో తెలుసుకుంటే..
భార్యాభర్తల తమ మనసులో ఉండే భయాలు, గత అనుభవాలను షేర్ చేసుకోవడం, ఏ విషయాన్ని అయినా మొదట తన భాగస్వామితోనే చెప్పుకోవడం వంటివి చేయడం వల్ల అవతలి వ్యక్తి మనసులో ఒక మంచి అబిప్రాయం, నమ్మకం ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది భార్యాభర్తల మద్య బంధాన్ని బలంగా ఉంచుతుంది.
తప్పులు అందరూ చేస్తారు. అలాగే భార్యాభర్తలు కూడా తప్పులు చేస్తుంటారు. భార్యాభర్తలు ఇద్దరూ తమ భాగస్వామి తప్పు చేసినప్పుడు వారిని నిందించడం చేస్తుంటారు. అయితే అలా నిందించడానికి బదులుగా తప్పు చేయడానికి గల కారణాలు తెలుసుకుని దానికి సరైన పరిష్కారం చెప్తే ఇంకొకసారి తప్పు చేయకుండా సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తారు. అంతేకాదు.. భాగస్వామి తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించడమే కాదు.. తను తప్పు చేసినా దాన్ని ఓపెన్ గా చెప్పి అంగీకరించే స్వభావం కూడా కలిగి ఉండాలి. అలా ఉంటే ఇద్దరూ బాగుంటారు.
ఇద్దరూ కలిసి చేసే ఏ పని అయినా చాలా మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది ఇద్దరినీ దగ్గర చేస్తుంది.
మంచి, చెడులను పరస్పరం పంచుకోవడం, ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య బంధం బాగుంటుంది. ఒకరి మీద మరొకరికి నమ్మకం కూడా ఏర్పడుతుంది.
చెబితే నమ్మరు కానీ ఫోన్లు చేసుకోవడం, మెసేజ్ చేయడం కంటే ఉత్తరాలు రాసుకోవడం, ఒకరికి ఒకరు కాగితాలలో ఏదైనా సమాచారాన్ని షేర్ చేసుకోవడం వంటివి చాలా మంచి అనుభవాన్ని ఇస్తాయి.
*రూపశ్రీ.