బాబుపై అలిపిరి దాడి జరగడానికి కారణం

 

2017 ట్రైనీ బ్యాచ్ ఎస్‌ఐలతో ఈ రోజు సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.. ఈ సందర్బంగా మాట్లాడిన బాబు 'తప్పు చేస్తే దొరికిపోతామనే భయం ఉంటే నేరాలు జరగవు.. రాష్ట్రవ్యాప్తంగా 20వేల సీసీ కెమెరాలు పెట్టబోతున్నాం.. టెక్నాలజీ వినియోగిస్తే పోలీసింగ్‌ సులువు అవుతుందని' పేర్కొన్నారు.. అదే విధంగా 2003 లో తనపై జరిగిన అలిపిరి దాడి గురించి ప్రస్తావించిన బాబు.. 'రాయలసీమలో ఫ్యాక్షన్‌ ఉండేది, హైదరాబాద్‌లో వీధికో రౌడీ  ఉండేవాడు, నక్సలిజం హైదరాబాద్‌ వరకు విస్తరించిందని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ అరికట్టామని, దానికి పర్యవసానంగా తనపై అలిపిరిలో దాడి జరిగిందని' చెప్పారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu