ప్రకాష్ రాజ్ హత్యకు కుట్ర
posted on Jun 27, 2018 4:13PM
.jpg)
ప్రకాష్ రాజ్.. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.. విలన్ గా, తండ్రిగా, తాతగా ఇలా ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులని మెప్పించారు.. సినిమాలలో ఇంతగా మెప్పించిన ప్రకాష్ రాజ్ పేరు రాజకీయాల్లో కూడా వినిపిస్తూ ఉంటుంది.. దానికి కారణం ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే.. ప్రకాష్ రాజ్ చాలా సందర్భాల్లో బీజేపీని విమర్శించారు, ఇప్పటికీ అప్పుడప్పుడు విమర్శిస్తూనే ఉంటారు.. అయితే ఇప్పుడొక వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. ప్రకాష్ రాజ్ హత్యకు భారీ కుట్ర జరిగిందట.. ఈ విషయాన్ని ఈ కుట్ర పన్నిన వ్యక్తే స్వయంగా అంగీకరించాడు.. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురవడం.. గౌరీ లంకేష్ హత్య కేసు ప్రధాన నిందితుడు పరశురామ్ వాఘ్మెర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే..
అయితే ఈ హత్య కేసు విచారిస్తున్న టీంకు ఓ షాకింగ్ విషయం తెలిసింది.. గౌరీ లంకేష్ హత్య కేసు ప్రధాన నిందితుడు పరశురామ్, ప్రకాష్ రాజ్ హత్యలు కుట్ర పన్నినట్టు తెలిపాడట.. గౌరీలంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ప్రకటనలు చేయడం, అలానే మోడీ మీద బీజేపీ మీద విమర్శలు చేస్తుండటంతో.. ప్రకాష్ రాజ్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నామని పరశురామ్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.. అయితే ఈ విషయంపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. 'తాను ఏ మతానికి వ్యతిరేకం కాదు.. కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయవద్దు.. ప్రజాసమస్యలపై తన గళాన్ని నొక్కేయాలని ప్రయత్నిస్తే అది మరింత బలంగా తయారవుతుందని' ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసారు.