ఆసుపత్రి పాలైన రవితేజ.. సినిమాలకు బ్రేక్!

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ (Raviteja). ఇటీవల 'మిస్టర్ బచ్చన్'తో ప్రేక్షకులను పలకరించిన రవితేజ.. ప్రస్తుతం 'సామజవరగమన' రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో తన 75వ సినిమా (RT75) చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో రవితేజ గాయపడ్డాడు.

RT75 చిత్రీకరణలో రవితేజ కుడి చేతికి గాయమైంది. అయినప్పటికీ గాయాన్ని, నొప్పిని లెక్క చేయకుండా.. షూటింగ్ ని కంటిన్యూ చేయడంతో అది తీవ్రమైందట. కుడిచేతి గాయం ఎక్కువ కావడంతో ఆయనను యశోద ఆసుపత్రిలో చేర్పించగా.. సర్జరీ చేసిన వైద్యులు, ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు.. పూర్తిగా రికవర్ అయ్యేవరకు సినిమా షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చి, రెస్ట్ తీసుకోవాలని రవితేజ నిర్ణయించుకున్నట్లు సమాచారం.