రీ రిలీజ్ లోనూ మెగా మాస్.. ఇంద్ర రికార్డు కలెక్షన్స్!

రీ రిలీజ్ లోనూ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాయి. చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు(ఆగష్టు 22) కానుకగా 'ఇంద్ర' రీ రిలీజ్ కాగా, మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. 

'ఇంద్ర' (Indra) రీ రిలీజ్ లోనూ మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.3.05 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా తెలుగు సినిమాల్లో ఆరో స్థానంలో నిలిచింది. 'మురారి', 'బిసినెస్ మేన్' మొదటి రోజు రూ.5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా.. 'ఖుషి', 'సింహాద్రి' రూ.4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాయి. 'జల్సా' రూ.3 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయగా, ఇప్పుడు ఆ లిస్టులో 'ఇంద్ర' చేరింది.

ఏరియాల వారీగా చూస్తే 'ఇంద్ర' మూవీ నైజాంలో రూ.1.08 కోట్ల గ్రాస్, సీడెడ్ లో రూ.30 లక్షల గ్రాస్, ఆంధ్రాలో రూ.54 లక్షల గ్రాస్ రాబట్టగా.. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.40 లక్షల గ్రాస్, ఓవర్సీస్ రూ.73 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది.