నీహారిక కొణిదెల లైఫ్ సెటిల్.. ఇక తొక్కుకుంటా పోవడమే  

కొన్ని సార్లు అంతేనండి బాబు చిన్న సినిమా అనే పేరుతో రిలీజ్ అవుతాయి. పెద్ద సినిమా రేంజ్ లో సక్సెస్ ని సాధిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి కమిటీ కుర్రోళ్లు. ఇప్పుడు ఈ మూవీ నయా రికార్డ్స్ ముంగిట నిలిచింది. ఒక రకంగా చాలా ఏళ్ళ తర్వాత తెలుగు సినిమాకి దక్కిన గౌరవంగా కూడా భావించవచ్చు. 

కమిటీ కుర్రోళ్లు ని మెగాడాటర్ నీహారిక కొణిదెల(niharika konidela)నిర్మించగా యదు వంశీ (yadu vamsi) దర్శకత్వాన్ని వహించాడు.అగస్ట్ 9 న థియేటర్స్ లోకి అడుగుపెట్టి   ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది.  సాయికుమార్, గోపరాజు రమణ, ఒకప్పటి లెజండరీ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి లాంటి సీనియర్ యాక్టర్స్ తప్పితే మోస్ట్ లీ  అందరు  కొత్తవాళ్లే. ఇక  మూవీ మొత్తం  రెండు వారాలకి  15.6 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకుంది. దీన్ని బట్టి ప్రేక్షకుల నుంచి    ఎంతటి ఆదరణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు మూడవ వారం నుంచి రెండు తెలుగు రాష్టాల్లో మరింత స్క్రీన్స్ పెరుగుతున్నాయి.తెలుగు సినిమాకి ఇలాంటి గౌరవం చాలా ఏళ్ళ తర్వాత లభిస్తుందని కూడా  చెప్పవచ్చు. 

అలాగే ఈ విజయంతో నీహారిక సినీ లైఫ్ సెటిల్ అయినట్లే.  నిర్మాతగా ఆమె నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని  మెగా అభిమానులు  సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా చేస్తున్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహ్రా, టీనా శ్రావ్య , సాయి కుమార్(sai kumar)గోపరాజు రమణ(goparaju ramana)తదితరులు ముఖ్య పాత్రల్లో చెయ్యగా అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందించాడు. ఇక ఇంకో ఆసక్తి కర విషయం ఏంటంటే  ఎన్నో  అంచనాలతో వచ్చిన   డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ లని ధాటి కమిటీ కుర్రోళ్లు ముందుకు దూసుకెళ్తుండటం విశేషం.