నగదు ఊసే లేని రాముడి బ్యాంకు.. రామ్ రమాపతి బ్యాంక్
posted on Apr 7, 2023 12:43PM
పుణ్యం బ్యాంకులో దాచుకున్న సొమ్ము లాంటిది.. కష్టం వచ్చినప్పుడు ఆ పుణ్యమే కాపాడుతుంది అని పెద్దలు సుద్దులు చెబుతుంటారు. కానీ నిజంగానే పుణ్యాన్ని దాచుకునేందుకు ఒక బ్యాంకు ఉంది. మీకు తెలుసా. ఇదేమీ అభూత కల్పన కాదు. నిజ్జంగా నిజం. ఉత్తర ప్రదేశ్ లోని ఓ బ్యాంకు మీ పుణ్యాన్ని డిపాజిట్ గా స్వీకరిస్తుంది. ఆ బ్యాంకు పేరు రామ్ రమాపతి బ్యాంకు. రామకోటి రాస్తే వేయి జన్మల పుణ్యం లభిస్తుందంటారు. రామనామాలు రాస్తే సకల సంపదలూ సిద్ధిస్తాయంటారు. రామ కోటి రాస్తే పుణ్య లోకాలు సంప్రాప్తిస్తాయంటారు. అంటే రామనామ రచన పుణ్యం అన్నమాట. అలా రాసిన రామనామాలను ఓ బ్యాంకు డిపాజిట్ గా స్వీకరిస్తోంది. అంటే పుణ్యాన్ని డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోందన్న మాట.
ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో రామ్ రమాపతి బ్యాంకు.. కార్యకలాపాలు పూర్తిగా రామ నామాలను డిపాజిట్ గా స్వీకరించడానికే పరిమితం. అంటే ఈ బ్యాంకుకు సొమ్ములతో సంబంధం లేదు. కేవలం మానవుడిలోని ఆధ్మాత్మిక భావనతోనే సంబంధం. అందుకే రామ్ రమాపతి బ్యాంక్ ఆధ్మాత్మిక బ్యాంకుగా ప్రసిద్ధం పొందింది. ఆ బ్యాంకులో ‘శ్రీరామ నామాలను’డిపాజిట్ చేసుకుంటారు. రామకొటి రాసి వాటిని ఏ దేవాలయంలోనే సమర్పిస్తారు భక్తులు. కానీ వారణాశిలోని రామ్ రమాపతి బ్యాంక్ మాత్రం ఆ కోటి రామనామాలను డిపాజిట్ గా స్వీకరిస్తుంది. అయితూ అలా డిపాజిట్ గా రామనామాలను జమ చేసుకోవడానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి. రామ కోటిని భక్తి శ్రద్ధలతో రాయాలి. అలా రాయడానికి ఆ బ్యాంకు వారే ఓ పెన్ను ఇస్తారు. ఆ పెన్ను మామూలు పెన్ను కాదు.. ఓ ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేసిన పెన్ను.
ఇక ఈ బ్యాంకు ఇప్పటి వరకూ 1,942.34 కోట్ల రామ నామాలను డిపాజిట్ గా స్వీకరించింది. గత తొమ్మిదిన్నర దశాబ్దాలకు పైగా ఈ బ్యాంకును మెహ్రోత్రా కుటుంబం గత ఈ బ్యాంకులో దివంగత ప్రధాని లాలా బహదూర్ శాస్త్రి తల్లి రామనామాలు డిపాజిట్ చేశారు. డిపాజిట్ తీసుకున్నారని తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి వేసిన ఆహారంతోపాటు బయట తయారు చేసిన ఎటువంటి ఆహారం తినకూడదనే నియమం ఉంది. మాంసాహారం అస్సులు ముట్టుకూడదు. ఇలా నియమ నిబంధనలు పాటించి రామనామం రుణం తీర్చుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మతారు. ఈ బ్యాంకకు భారతీయులే కాక కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జపాన్ దేశాల నుంచి కూడా వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు. రామనామాలు రాసే సమయంలో సదరు భక్తులు ఆహార నియమాలనూ పాటించాలి. వెల్లుల్లి, ఉల్లిని పూర్తిగా దూరం ఉంచాలి. మాంసాహారమూ నిషేధమే. అంతేనా.. ఇక్కడ ఖాతా తెరిచిన తరువాత 8 నెలల పది రోజులలో రామనామాలు రాయడం పూర్తి చేసి బ్యాంకుకు డిపాజిట్ చేయాలి. బ్యాంకు వారు ఇచ్చిన పెన్నుతోనే రామనామాలు రాయాలి. అలాగే బ్రహ్మముహూర్తంలోనే రామనామ రచన చేయాలి. అంటే ఉదయం నాలుగు గంటలకు మొదలు పెట్టి 7 గంటల వరకూ రాయాలి. అదీ బ్యాంకు వారు ఇచ్చిన రెడ్ ఇంక్ తోనే రాయాలి.
ఒక్కో ఖాతాదారుడూ లక్షా 25 వేల రామ నామాలు రాసి బ్యాంకులో జమ చేయాలి. అవి సదరు వ్యక్తి ఖాతాలో జయ చేయబడతాయి. ఇలా నిబంధనలు పాటించి భక్తి శ్రద్ధలతో రామనామాలు రాసి బ్యాంకులో జమ చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ బ్యాంకకు భారతీయులే కాదు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జపాన్ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు.