ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు టెక్కీలు దుర్మరణం...
posted on Jul 3, 2017 4:45PM

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందిన ఘటన పూణె-అహ్మద్ నగర్ హైవేపై చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... అహ్మద్ నగర్ లో జరిగిన స్నేహితుడి వివాహానికిగాను పూణెకు చెందిన 13 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఓ మినీ బస్సులో వెళ్లారు. అక్కడ వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో పూణెకు నలభై కిలోమీటర్ల దూరంలో వారు వస్తున్న వాహనాన్ని ఎదురుగా వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు టెక్కీలు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్సపొందతూ మరో వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్యాంకర్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.