మోడీ టీ అమ్మిన రైల్వే స్టేషన్... ఇకపై టూరిస్ట్ ప్లేస్
posted on Jul 4, 2017 10:35AM

ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లాష్ బ్యాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాల్యంలో ఆయన టీ అమ్మేవాడని.. ఆస్థాయి నుండి ఇప్పుడు ప్రధాని అయ్యే స్థాయి వరకూ ఎదిగారన్న విషయం ప్రతిఒక్కరికి తెలుసు. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ బాల్యన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. మోడీ బాల్యంలో టీ అమ్మిన గుజరాత్‌లోని వాద్‌నగర్ రైల్వే ప్లాట్‌ఫాంను పర్యాటక ప్రదేశంగా మార్చాలని నిర్ణయించుకుంది. ప్లాట్‌ఫాంపై ఉన్న టీ స్టాల్‌ను పునరుద్ధరించి పర్యాటక ప్రదేశంగా మార్చాలని కేంద్ర సాంస్కృతిక శాఖామంత్రి మహేశ్ శర్మ తెలిపారు. తద్వారా ఆ ప్రాంతానికి ప్రపంచ పర్యాటక పటంలో గుర్తింపు వస్తుందన్నారు.