ఆఖరికి పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్..
posted on May 30, 2016 4:39PM

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికుల జరిగిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటైపోయింది. ఒక్క పుదుచ్చేరిలో తప్ప. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరుగగా అందులో 17 స్థానాలు కాంగ్రెస్ గెలిచి అధికారం కైవసం చేసుకుంది. అయితే పార్టీలో అంతర్గత విభేదాలతో ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయలేదు. అయితే పార్టీ అధిష్ఠానం సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వీ.నారాయణస్వామిని ముఖ్యమంత్రిగా నియమించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఎట్టకేలకు పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ కదిలినట్టు తెలుస్తోంది. మరోవైపు పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీతో వీ.నారాయణ స్వామి ఈరోజు భేటీ అయ్యారు. పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటు చేయవల్సిందిగా కోరారు.