తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ కు షాకు.. గులాబీ గూటికి నేతలు..

 


తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగలనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీనుండి పలువురు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరగా ఇప్పుడు కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా గులాబీ గూటికి చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జూన్‌ మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా వేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

 

 

ఇక తెలంగాణ టీడీపీ కి కూడా షాక్ తగలనున్నట్టు సమాచారం. ఒక పక్క ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి వైసీపీ నేతలు జంప్ అవుతుంటే.. తెలంగాణలో మాత్రం దానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు టీఆర్ఎస్లోకి చేరుతున్నారు. ఈనేపథ్యంలోనే మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే మల్లారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ వారివారి అనుచరులతో మంతనాలు జరిపారు. నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో వీరు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu