కన్న ప్రేమను చూపించిన లాలూ...!
posted on May 30, 2016 4:44PM

కట్టుకున్న భార్యకన్నా కొడుకులు, కూతుళ్లు అంటేనే చాలా మంది భర్తలకి ఇష్టం. సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా ఎందరి విషయంలోనో...ఎన్నో సందర్భాల్లోనో ఈ విషయం నిరూపించబడింది. తాజాగా రైల్వేశాఖ మాజీ మంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేతి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు వివిధ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అలాగే ఆర్జేడీ నుంచి లాలూప్రసాద్ యాదవ్ వంతుకు వస్తే. రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడటానికి ముందు నుంచే ఆయన భార్య రబ్రీదేవి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ..భార్య రబ్రీదేవిని కాదని కూతురు మీసాభారతికి సీటు ఇచ్చారు. దీనిపై ఉదయం వరకు సస్పెన్స్ నడిచింది. కాని చివరకు కూతురివైపే ఆయన మొగ్గుచూపారు.