వెయ్యి మంది స్టార్స్ కలిస్తే నా కొడుకు.. పవన్ ఫ్యాన్స్ పై ప్రభాస్ తల్లి కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్రభాస్ (prabhas)కల్కి(kalki 2898 ad)మానియాతో నిండి పోయింది.ఎవర్ని కదిలించినా  కల్కి గురించే చెప్తున్నారు. అందుకు తగ్గట్టే విడుదలైన అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధం అవుతున్నానే సంకేతాన్ని కూడా  ఇస్తుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేం. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ని చూసి పూనకంతో ఊగిపోతున్నారు. ఇప్పుడు వాళ్ల  సరసన ప్రభాస్ తల్లి కూడా చేరింది.

రెబల్ స్టార్ కృష్ణంరాజు (krishnam raju)భార్య పేరు శ్యామలా దేవి (shyamala devi)మొదటి భార్య చనిపోవడంతో 1996 లో శ్యామలా దేవిని రెండవ వివాహం చేసుకున్నాడు.  ప్రభాస్ కి శ్యామలాదేవి అంటే చాలా అభిమానం. తన సొంత తల్లిగానే భావిస్తాడు. శ్యామలా దేవి ఈ రోజు ఉదయమే కల్కి ని వీక్షించింది. అనంతరం బయటకి వచ్చి  మీడియాతో ముచ్చటించింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది.ఫస్ట్ నుంచి చివరి వరకు అందరు ఒకటే విజిల్స్ క్లాప్ లు. ప్రతి ఒక్కరు థియేటర్ లో  చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.   దేశ విదేశాల నుంచి కూడా మూవీ వండర్ అని   మెసేజ్ లు చేస్తున్నారని చెప్పింది. 

ఇక ప్రభాస్ ని అయితే ఆకాశానికి ఎత్తింది. మా  ప్రభాస్ సుప్రీమ్ హీరో యూనివర్సల్ హీరో కాదు అంతకంటే ఎక్కువ. వెయ్యి మంది  రెబల్ స్టార్ లు కలిస్తే మా రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడు అని చెప్పుకొచ్చింది.  అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కల్కి కి చాలా సపోర్ట్ చెయ్యడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని కూడా తెలిపింది. శ్యామలా దేవి మాటలు  ప్రస్తుతం  సోషల్ మీడియాలో  ట్రెండింగ్ గా నిలిచాయి.