మెగా హీరోకి రెమ్యునరేషన్ తగ్గించారు..అందుకు కారణం ఆయనే

ముకుంద, ఫిదా, తొలిప్రేమ, గద్దల కొండ గణేష్, ఎఫ్ 2 లతో అశేష సినీ ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న హీరో వరుణ్ తేజ్(varun tej)అభిమానులు మెగా ప్రిన్స్ అని పిలుచుకుంటారు. దీన్ని బట్టి ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అర్ధం చేసుకోవచ్చు.  గత కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తు ప్లాప్ ల పరంపరని ఎదుర్కొంటున్నాడు. అభిమానులు కూడా  కట్ అవుట్ కి తగ్గ సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మట్కా  చేస్తున్నాడు.  ఇప్పుడు  ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ వైరల్ గా మారింది.

వరుణ్ తేజ్ కెరీర్ లోనే  మ‌ట్కా(matka)అత్యంత భారీ వ్యయంతో రూపొందుతుంది.  50 కోట్లతో నిర్మాణం జరుపుకుంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని వ‌రుణ్ తేజ్ త‌న రెమ్యున‌రేష‌న్ ను తగ్గించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మట్కా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు 12 కోట్ల వరకు  డిమాండ్ చేసిన వ‌రుణ్‌  ఇప్పుడు  6 కోట్లు మాత్రమే రెమ్యున‌రేష‌న్ గా తీసుకుంటున్నాడని అంటున్నారు.  త‌న సినిమా బ‌డ్జెట్ లో మార్పు జ‌రుగుతుండ‌టంతో, రెమ్యున‌రేష‌న్ త‌గ్గించి నిర్మాత‌ల‌కు మేలు చేయాల‌నే అలాంటి  నిర్ణ‌యం తీసుకున్నాడ‌నే చర్చ నడుస్తుంది.

మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా చేస్తుండగా  పలాస ఫేమ్  క‌రుణ కుమార్  దర్శకత్వం వహిస్తున్నాడు.  వైరా ఎంట‌ర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంట‌ర్టైన్మెంట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం  రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్  జరుగుతుంది.  వైజాగ్   వాతావరణాన్ని ప్రతిబంబిస్తు సెట్ వేశారు. వరుణ్   వింటేజ్ లుక్ లో తన సత్తా చాటనున్నాడు.