పెళ్లి కార్డుతో వైకుంఠాన్ని భూమ్మీదకి తెచ్చిన అంబానీ

  

నువ్వు నాకు నచ్చావు మూవీలో విక్టరీ వెంకటేష్  పెళ్లి ఎలా చెయ్యాలో ఒక  పాట రూపంలో  చెప్తాడు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి అని అంటాడు. అంటే పెళ్లి పందిరి ఒక రేంజ్ లో  వెయ్యాలని  వెంకీ ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ సూత్రాన్ని ముకేశ్ అంబానీ  ఫాలో అవుతున్నాడు. ఏంటి అంతేనా! అంబానీ అంటే అంతకు  మించి ఉండాలి   అనుకుంటున్నారు కద. మీరు  అనుకునేది  నిజం. పెళ్లి అంతకు మించే ఉంటుంది. కానీ ఇప్పుడు  నేను చెప్పేది పెళ్లి కార్డు గురించి. 

ముకేశ్ అంబానీ(mukesh ambani)నీతా అంబానీ (nita ambani) ల పెద్దకొడుకు పేరు  అనంత్ అంబానీ(anant ambani)ప్రముఖ వ్యాపారవేత్త వైరన్ మర్చంట్ కూతురు   రాధికా మర్చంట్(radhika merchant)తో అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకు  సంబంధించిన పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో   వైరల్ గా మారింది. బంగారు రంగు ఛాయతో మెరిసిపోతూ ఉంది .కార్డు ఓపెన్ చెయ్యగానే పద్మ పుష్పంతో కొలువు తీరిన విష్ణు మూర్తి ఉన్నాడు. ఆ తర్వాత  వినాయకుడు, అమ్మ వారు, వేంకటేశ్వరుడి  తిరునామాలు ఇలా అణువణువునా భక్తి భావంతో ఉంది. కార్డు చూసిన  వాళ్ళందరు అంబానీ కి ఇంత దైవ భక్తి ఉందా అని అనుకుంటున్నారు. అసలు వైకుంఠాన్నే కిందకి తీసుకొచ్చినట్టుగా ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.  వెండి పూత పూసిన చిన్న దేవాలయం ప్రత్యేక  ఆకర్షణ.

 

 

ఇక అనంత్ రాధికా ల వివాహం జులై 12 న ముంబైలోని జియో కన్వెక్షన్ సెంటర్ లో జరగనుంది. . జూలై 12న  శుభ్ వివాహ జూలై 13న  శుభ్ ఆశీర్వాద్, జూలై 14న  మంగళ ఉత్సవ్ లు జరగనున్నాయి. ఇలా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది భోజనం మెను కూడా అదిరిపోనుంది.