జయలలిత కొడనాడు ఎస్టేట్...అకౌంటెంట్ ఆత్మహత్య
posted on Jul 4, 2017 11:19AM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో ఏది జరిగిన అది పెద్ద సంచలనంగానే మారింది. జరిగే సంఘటనలు చూసినా అలా అనిపించక మానదు. ఇప్పటికే జయలలిత కొడనాడు ఎస్టేట్ వాచ్ మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. జయ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు చోరి చేయడానికి వచ్చి ఈ హత్య చేశారు. ఇది పెద్ద కలకలమే రేపింది. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. కొడనాడు ఎస్టేట్‌కు చెందిన అకౌంటెంట్ దినేష్ కుమార్ సోమవారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొత్తగిరిలోని ఆయన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. దీంతో ఇప్పుడు ఈ ఘటన కూడా కలకలం రేపుతోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కొత్తగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కొడనాడు ఎస్టేట్‌లో పని చేస్తున్న ముగ్గురు అకౌంటెంట్లలో దినేష్ కుమార్ ఒకడు. మొత్తం దినేష్ తో కలిపి ఇప్పటికి కొడనాడు ఎస్టేట్‌లో అనుమానస్పద మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.