మోడీ..నవాజ్ షరీఫ్ కలిసిన వేళ..
posted on Jun 9, 2017 12:15PM
.jpg)
ప్రస్తుతం పాక్-భారత్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు దేశాల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలోనే జరగాల్సిన సమావేశాలు కూడా రద్దయ్యాయి. ఒకపక్క సరిహద్దు ప్రాంతాల్లో రెండు దేశాల మధ్య జరుగుతున్న కాల్పులు.. ఇంకోపక్క కులభూషణ్ యాదవ్ కేసు.. ఉగ్రవాదుల చొరబాట్లు ఇలా రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. పాక్ ప్రధాని నవాష్ షరీఫ్ ఇద్దరూ కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేటివ్ సమ్మిట్(ఎస్‌సీవో) రిసెప్షన్‌లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని కాసేపు ముచ్చటించుకున్నారు. కాగా 2015 లో లాహోర్ లో కలిసిన వీరిద్దరూ మళ్లీ ఇదే కలుసుకోవడం.