కేజ్రీవాల్ ఇంటికి కపిల్ మిశ్రా.. అడ్డుకున్న సెక్యూరిటీ..
posted on Jun 9, 2017 12:41PM

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఆప్ బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటికే వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తాను కేజ్రీవాల్ ఇంటికి వెళతానని.. ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎందుకు బర్తరఫ్ చేయలేదని అడుగుతానని చెప్పారు. ఇక చెప్పినట్టుగానే ఈరోజు కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు. కానీ కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బంది మిశ్రాను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మిశ్రా వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం మిశ్రా మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు.