ఓటమిపై కోహ్లీ... వారిని ఎంతోగానో నమ్మా..

 

చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక- భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా శ్రీలంక చేతిలో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో భారత్ పై ఏడు వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఇక టీమిండియా ఓటమిపై కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. 'మా బౌలర్లను ఎంతగానో నమ్మాను. 322 పరుగులంటే సాధారణ లక్ష్యమేం కాదు. బౌలర్లు ఎలాగైనా గెలిపిస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వారి టైమింగ్ తో పాటు షాట్ సెలక్షన్ కూడా బాగుందని అన్నాడు. బౌలర్లు తమ ఆలోచనకు మరింత పదును పెడితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని' అభిప్రాయపడ్డాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu