చంద్రబాబు, కేసీఆర్ తో మోడీ భేటీ?
posted on Jun 27, 2018 3:12PM

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈమధ్యనే మోడీతో భేటీ అయ్యి వినతిపత్రం ఇచ్చారు.. మళ్ళీ భేటీ ఏంటి?.. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అయితే కేంద్రం, రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ కేంద్రం మీద పోరాడుతున్నారు.. అలాంటిది మోడీ, చంద్రబాబుతో భేటీ ఏంటి?.. అసలు తెలుగు రాష్ట్రాల సీఎంలతో మోడీ ఎందుకు భేటీ అవుతున్నారని ఆలోచిస్తున్నారా.. దాని వెనుక బలమైన కారణం ఉందిలేండి.. తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో ఉన్న హామీలను కేంద్రం ఇంకా నెరవేర్చలేదు.. త్వరలో జరుగనున్న పార్లమెంట్ సమావేశంలో తెలుగు ఎంపీలు ఆందోళన చేసి సమావేశాలకు ఆటంకం కలిగించే అవకాశముంది.. ముఖ్యంగా ఏపీ టీడీపీ ఎంపీలు.. ఇప్పటికే కడప స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ నేతలు దీక్ష చేస్తున్నారు.. ఇక పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి కేంద్రాన్ని గట్టిగా నిలదీసే అవకాశముంది.. అందుకే మోడీ భేటీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.. తెలుగు రాష్ట్రాల సీఎంలతో విభజన హామీల గురించి చర్చించి వాళ్ళని శాంతింపచేయాలని చూస్తున్నారట.. మరి చంద్రబాబు ఒప్పుకుంటారా? అసలే బీజేపీ నాలుగేళ్లు మోసం చేసిందని టీడీపీ విమర్శిస్తోంది.. అలాంటిది మళ్ళీ బీజేపీని నమ్మి పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసే అవకాశాన్ని పొగొట్టుకుంటదా? చూద్దాం మోడీ ఆలోచన ఫలిస్తుందో లేదో.