సీఎం ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య కార్యదర్శిగా ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి పియూష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన పీయూష్ కుమార్ కేంద్రంలో డెప్యూటేషన్ పై పని చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వ వినతిపై కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసింది. కాగా పీయూష్ కుమార్ కు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తే ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.  

కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీ కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీయూష్ కుమార్‌ ను రాష్ట్రానికి పంపించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వినతికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.   కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా ఉన్న పీయూష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగానే కాకుండా అదనంగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా కూడా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది.

జగన్ తన హయాంలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసేశారు. జగన్ ఆర్ధిక అరాచకత్వం కారణంగా రాష్ట్ర ఖజానా దాదపు ఖాళీ అయిపోయింది. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలికితీసి, రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు పీయూష్ కుమార్ అయితేనే సరిపోతారని భావించిన చంద్రబాబు ఆయనకు కీలకబాధ్యతలు అప్పగించారు.