పెండింగ్‌లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్
posted on Mar 26, 2019 3:46PM

నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం, ఓడిపోవడం తరువాత సంగతి. అసలు ముందు నామినేషన్ సరిగ్గా వేయడం ముఖ్యం. గతంలో పలువురు నాయకులు.. నామినేషన్ తిరస్కరణకు గురై పోటీకి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో ఓ వైసీపీ నేతకి తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందా? అనే భయం పట్టుకుంది. తూర్పు గోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు పెండింగ్‌లో పెట్టారు. మాజీ ఎమ్మెల్యేగా ఆయన తీసుకుంటున్న పెన్షన్‌ను అఫిడవిట్‌లో నమోదు చేయకపోవడమే దీనికి కారణం. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టారు.