ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రచ్చ..
posted on Dec 10, 2015 9:01AM
ఓయూ విద్యార్ధులు ఈరోజున ఎలాగైన బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఓయూ దగ్గర తీవ్ర ఉద్రిగ్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అర్ధరాత్రే ఓయూ హాస్టళ్లలో సోదాలు జరిపి 16 మంది బీఫ్ ఫెస్టివల్ నిర్వహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా తాము తప్పకుండా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని ఫెస్టివల్ నిర్వాహకులు తేల్చి చెబుతుంటే.. ఎట్టి పరిస్థితిలో ఫెస్టివల్ జరగనివ్వమని గోసంరక్షణ సమితి చెబుతుంది. మరోవైపు బీఫ్, పోర్క్ ఫెస్టివల్ నిర్వహాణకు ఎలాంటి అనుమతి లేదని.. ఒకవేళ ఫెస్టివల్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఓయూ విద్యార్ధులైతే అడ్మిషన్ను రద్దు చేస్తామని ఓయూ రిజిస్టార్ తెలిపారు. ఇదిలా ఉండగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ కు హైకోర్టు కూడా అనుమతివ్వలేదు. అయినా ఓయూ స్టూడెంట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెబుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మొహరించారు. ఓయూ అన్ని రహదారులను మూసివేశారు.